Monday, June 17, 2013

ఎవర్ని నమ్మాలి!

వేసవి పచ్చదనం ఎండమావుల్లో తీరిన దాహం తీరని రక్త దాహం .... ఉగ్రవాదం ఉగ్రవాదం గుండెల్లో నిండుతుందనుకునే దయ కనికరం నేతి బిరకాయలో నెయ్యుందనుకు... thumbnail 1 summary

వేసవి పచ్చదనం
ఎండమావుల్లో తీరిన దాహం
తీరని రక్త దాహం .... ఉగ్రవాదం
ఉగ్రవాదం గుండెల్లో నిండుతుందనుకునే దయ కనికరం
నేతి బిరకాయలో నెయ్యుందనుకునే ....
సామాన్యుడి నమ్మకం .... కల
అయితే,  
లబ్ది పొందేందుకు .... గొంతుక్కూర్చునున్న నక్కలవిగో
ఔనూ
ఉగ్రవాదానికి
రాజకీయం తో చుట్టరికం ఏమిటో ....
ఒకరికొకరు ఆతిధ్యాలిచ్చుకుంటుంటారు ....
ఒకరు అపహరించి .... బేరసారాలాడేందుకు
ఒకరు జైల్లో సకల సౌకర్యాలూ కూర్చి .... మరీ
ఎందుకో?

No comments

Post a Comment