Monday, June 17, 2013

అది నీవే!

ఓ చిన్న కవితను అల్లాలనిపించింది ఊహల తోట లో .... ఒంటరిలా నా ఆలోచనలు పచార్లు చేస్తున్నాను. అనుకోకుండా చల్లని మృదువైన లేత గాలి తెంపరొకటి నా ... thumbnail 1 summary

ఓ చిన్న కవితను అల్లాలనిపించింది
ఊహల తోట లో .... ఒంటరిలా
నా ఆలోచనలు పచార్లు చేస్తున్నాను.

అనుకోకుండా

చల్లని మృదువైన లేత గాలి తెంపరొకటి
నా ఆలోచనల్ని ప్రభావితం చేస్తూ వీచింది.
నా మది నా నియంత్రణలో లేకుండా చేస్తూ

ఆ చిరు గాలుల సున్నిత తరంగాలు లో,
ఏవో తియ్యని సువాసనలు తేలుతూ వచ్చాయి.

నా ఆత్మ సందడి చేసింది.
ఆ పరిమళాల్ని వెంటేసుకొచ్చింది నీవే అని గ్రహించి

No comments

Post a Comment