Monday, June 17, 2013

నిర్నిబంధ ప్రేమ!

మనసుభావనలు మాటల్లో చెప్పక్కర్లేదు. ఏ ప్రమాణాలు అవసరం లేదు. సున్నిత దృష్టి కోణం ప్రేమ .... ఉంటే చాలు. ఒక్కరుగా కలిసి ఒక్కరై జీవిస్తూ, ఒకే ఆ... thumbnail 1 summary



మనసుభావనలు
మాటల్లో చెప్పక్కర్లేదు.
ఏ ప్రమాణాలు అవసరం లేదు.
సున్నిత దృష్టి కోణం ప్రేమ .... ఉంటే చాలు.
ఒక్కరుగా కలిసి
ఒక్కరై జీవిస్తూ,
ఒకే ఆశ, ఆశయం జీవనమై ....
కలలు .... కలిసి కంటూ,
బౌతికంగా ....
వ్యక్తులు ఇద్దరైనా
ఒకే ఆలోచనై,
ఒకే ఆత్మ, హృదయం లా ఉంటూ,
చచ్చేంతవరకూ చేతిలో చెయ్యి ....
చచ్చాక స్వర్గంలో తోడు
మళ్ళీ జన్ముంటే
బేషరతు సమర్పణాభావం .... ప్రేముంటే

అది నిర్నిబంధ ప్రేమ!

No comments

Post a Comment