Monday, June 17, 2013

ధైర్యం అవసరం!

రణరంగం యుద్ధం అవసరం! సిద్దంగా ఉండాలి. తప్పదు. ప్రాణాలకు ముప్పు వచ్చినప్పుడు, .... కాపాడుకునేందుకు, ఒక విద్వంసకత్వాన్ని ఎదిరించేందుకు, యుద్ధ... thumbnail 1 summary

రణరంగం
యుద్ధం అవసరం!
సిద్దంగా ఉండాలి.
తప్పదు.
ప్రాణాలకు ముప్పు వచ్చినప్పుడు,
.... కాపాడుకునేందుకు,
ఒక విద్వంసకత్వాన్ని ఎదిరించేందుకు,
యుద్ధం
రణం అవసరమే!
అందరినీ మ్రింగెయ్యాలని చూసే ....
మహమ్మారిని ఎదుర్కునేందుకు,

కాని
ఎందుకో
నాకు మాత్రం
తళతళా మెరిసే పదునైన ....
కత్తి మొనంటే అయిష్టం!
వడిగా గాలిని చీల్చుకుని ....
గుండెల్లోకి దూరే బుల్లెట్ట్ అంటే అయిష్టం!
ఎవరో గుర్తుంచుకోవాలనే ....
కీర్తి కండూతి అంటేనూ అయిష్టం!
ఒక్క
ప్రాణాన్ని కాపాడుకునే,
ధైర్యం లక్షణం .... అంటే మాత్రం అపరిమితమైన ప్రేమ!

No comments

Post a Comment