Monday, June 17, 2013

అనుభూతులు

పురోగమించు భయపడిపోయి వెనుకకు చూసేందుకు వెనకాడకు! పరిశీలించు నిలబడిపోయి ఆలసించి కాలాన్ని గడిపెయ్యొద్దు! ఆలోచనల పరిపక్వత వివేకం చేరు... thumbnail 1 summary

పురోగమించు
భయపడిపోయి
వెనుకకు చూసేందుకు వెనకాడకు!
పరిశీలించు
నిలబడిపోయి
ఆలసించి కాలాన్ని గడిపెయ్యొద్దు!
ఆలోచనల
పరిపక్వత
వివేకం చేరువలోనే గమ్యం!
భూమి నీరు
గాలి ఆకాశం
అగ్ని అన్నీ స్పష్టంగానే ఉన్నాయి.
వయసుతో
ఆవేశంతో పాటు
శిదిలమౌతున్న నీ అస్తిత్వం తప్ప,
వీస్తున్న
ఆ గాలి
చేస్తున్న ఊళల శబ్దాలు,
నీ
నిన్నటి వ్యర్ధాలు
మరుపురాని తీపి జ్ఞాపకాలు.
అక్కడ,
మది పొరల్లో
ఏముందో నీకూ తెలుసు.
చెడు కాని
కాలాన్ని తినేసే
మధుర అనుభవాలు .... కొన్ని అని,
చూడొచ్చు
ప్రేరణ కోసం
గతం జ్ఞాపకాల బాండాగారాన్ని,
చూడొచ్చు
వెలుతుల్ని
కొత్త అనుభవాల్తో నింపేందుకు
నిన్న
నీడ కల అయి
పాత రోజులు అందంగా మధురంగా,
అమాయకత్వం
పొట్టిలాగుల్లో
అరమరికల్లేకుండా ఆడిన రోజులు
ఆటల
పర్యవసానాలు
గెలుపోటముల మూతి విరుపులు.
చెరువులో
ఈతలు
కోతి కొమ్మచ్చి కాళ్ళు బెణకటాలు.
జీవితం
నల్ల పలకపై తెల్లక్షరాలు
భవిష్యత్తును సాధన చేసేందుకు ఇందనాలు.

No comments

Post a Comment