Monday, June 17, 2013

నా మనసంతా నీవే!

ఆ మన్మథుడు గురితప్పని దయలేని పుష్ప బాణం గుండెను చీల్చేసింది నా కళ్ళముందు నీవు మాత్రమే నీ రూపమే కనిపిస్తుంది స్వచ్చమైన పాల వంటి మనసు ... thumbnail 1 summary

ఆ మన్మథుడు
గురితప్పని దయలేని పుష్ప బాణం
గుండెను చీల్చేసింది
నా కళ్ళముందు నీవు మాత్రమే
నీ రూపమే కనిపిస్తుంది

స్వచ్చమైన
పాల వంటి మనసు
ప్రేమ విషం కలిసి కలుషితం అయ్యింది.
నీవు మాత్రమే కావాలని .... నీ హృదయంలో మాత్రమే
చోటు కావాలని మారాం చేస్తుంది.

ప్రేమ
ప్రత్యామ్నాయం
బహుమానం
ఒక ముద్దు అందుకోవాలని ఉంది
బదులుగా ఒక ముద్దు బదులియ్యాలని ఉంది

నేను అబద్దం ఆడటం లేదు.
అసహనంగా ఉన్నాను.
మన్మధుడి సుమబాణం ....
తాకిన క్షణం నుంచి,
నా మనసంతా నీవే .... నిన్నే ప్రేమిస్తున్నా!

అంతరంగం నన్ను
కుదుటబడనీయడం లేదు.
అంగీకారమా నీకు .... అని,
నా బహుమానాన్ని అందుకునేందుకు .....
బహుమానంగా .... ఓ ముద్దిచ్చేందుకు సిద్దమేనా అని,

No comments

Post a Comment