Monday, June 17, 2013

ఆలశ్యం!

అయోమయం .... చీకటి, నిరాశ నిస్పృహల .... ఆలోచనల వేడి గాలులు నా మనసు గుండా ప్రవహిస్తున్నాయి. ఆకశ్మిక ఆక్రమణ ఏదో .... నాపై నాలో .... ఏదో అలజడి,... thumbnail 1 summary
అయోమయం .... చీకటి, నిరాశ
నిస్పృహల .... ఆలోచనల వేడి గాలులు
నా మనసు గుండా ప్రవహిస్తున్నాయి.
ఆకశ్మిక ఆక్రమణ ఏదో .... నాపై
నాలో .... ఏదో అలజడి, అస్థిమితం,
శాంతి లేని .... ఆవేశం బ్రద్దలైన భావాలు

నా భావాలు .... నియంత్రించేందుకు
నేను చేసే ప్రతి ప్రయత్నమూ విఫలమై
అలివికాని ఆవేశం అలసత్వం .... నాలో
నాలో నెలువెల్లా కంపన లై, ఆక్రోశం
జీవితంపై నియంత్రణ కోల్పోయి 
మరణించినా బావుండుననే భావన .... నాలో

అందకారం, నీరసం .... ఆవేశం, ఆక్రోశం
చుట్టూ కమ్ముకుపోయి భూమి బ్రద్దలైన ....
ఆలోచనల గాలులు .... మనసును
కాల్చేస్తున్నాయి .... లావాలా,
ఆకశ్మిక ఆక్రమణ ఏదో .... జరగబోతున్న
సూచనల్తో కసి, నిస్సహాయత .... కమ్ముకుంటున్నాయి.
చేతకాని, భరించాల్సిన .... శాంతి లేని బ్రతుకులో

నిజం!
ఆలశ్యం చేసాను ....
ఒక జీవిత కాలం
గాలి తో వర్షమూ వస్తుందని .... తెలుసుకునేందుకు

No comments

Post a Comment